📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్ మే 25 (ప్రజావాణి): వేసవి వేడిమిని దృష్టిలో ఉంచుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రేసు లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సమాజ సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ నిరంతరం కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సారా శ్రీనివాస్ గౌడ్, బచ్చు నాగేష్ కుమార్ గుప్తా, మారం లక్ష్మారెడ్డి, సారా మురళి గౌడ్, సారా రాజు ముదిరాజ్, బొమ్మ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular