*రేపే లబ్ధిదారుల ఎంపిక*
నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన 45 యూనిట్లకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఈనెల 20 న అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర సోమవారం తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ జిరాక్స్, ఆన్లైన్ దరఖాస్తు, ఆధార కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు జిరాక్స్ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.


