📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఉల్లాస్ – అక్షరాంధ్ర”

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఉల్లాస్ – అక్షరాంధ్ర”

📰 Generate e-Paper Clip

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఉల్లాస్ – అక్షరాంధ్ర”

కడప జిల్లా బద్వేల్ ఈ కార్యక్రమం లో భాగంగా మునిసిపల్ ఆఫీస్ నందు అక్షరాంధ్ర వాలంటీర్ల తో సమావేశం ఏర్పాటు చేసి బద్వేల్ పట్టణంలో 15 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి అక్షరాస్యత అందించడంతో పాటు 100 శాతం అక్షరాస్యత సాధించే దిశగా చర్యలు చేపడుతున్నామని మునిసిపల్ కమీషనర్ శ్రీ నరసింహారెడ్డి గారు తెలిపారు ఈ సందర్భంగా కమీషనర్ గారు ఉల్లాస్ – అక్షరాంధ్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం ద్వారా చదవడం, వ్రాయడం తెలియని

పెద్దలను గుర్తించి వారికి ప్రాథమిక విద్య అందించడం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.అక్షరాస్యతపై అవగాహన పెంపొందించే క్రమంలో భాగంగా లబ్ధిదారులకు పెన్‌లు పంపిణీ చేయడం జరిగింది. పట్టణ ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించి బద్వేల్ ను పూర్తి అక్షరాస్య పట్టణంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కమీషనర్ గారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ మేనేజర్ హరినాథ్ ,సీఎంఎం కళ్యాణ్ బాబు, సీవోలు, ఆర్పీలు మరియు అక్షరాంధ్ర వాలంటీర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular