📄 ePaper
Wednesday, April 1, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialరాజారాంపల్లి వారసంత వేలం పూర్తి

రాజారాంపల్లి వారసంత వేలం పూర్తి

📰 Generate e-Paper Clip

రాజారాంపల్లి వారసంత వేలం పూర్తి

రూ. 60.75 లక్షలకు దక్కించుకున్న సంఘ రాములు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, మార్చి 31 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ప్రతి మంగళవారం నిర్వహించే ప్రసిద్ధ వారసంతతో పాటు కూరగాయల సంత వేలం ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 1:00 గంటకు ఘనంగా ముగిసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్వహించిన ఈ బహిరంగ వేలంలో వ్యాపారులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఈ ఏడాది వేలం కోసం అధికారులు నిర్ణయించిన ఆఫ్‌సెట్ ధర (ప్రారంభ ధర) ₹36,59,112 కాగా, వేలంలో పాల్గొనేందుకు మొత్తం 37 మంది సభ్యులు ఆసక్తి చూపారు. నిబంధనల ప్రకారం ఒక్కొక్కరు ₹1,50,000 చొప్పున డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొన్నారు. వ్యాపారుల మధ్య జరిగిన హోరాహోరీ పాటలో, సంఘ రాములు యాదవ్ (తండ్రి: రాజలింగు) అత్యధికంగా ₹60,75,000 (అక్షరాలా అరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు) పాడి సంత హక్కులను కైవసం చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి వేలం పాట ద్వారా ప్రభుత్వానికి ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం లభించింది. ఆఫ్‌సెట్ ధర కంటే అదనంగా ₹25,64,888 రావడం విశేషం. ఈ వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ వి విమల, ఎంపీడీవో డి కృపాకర్, స్థానిక సర్పంచ్ సంగ రమేష్ యాదవ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular