ఘట్కేసర్, జూన్ 26: మొహరం పండుగ సందర్భంగా పోచారం 8వ డివిజన్లో ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరీమణులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ, పండుగల స్ఫూర్తి ప్రేమ, ఐక్యత, సోదరభావమని, ప్రజల సేవే తమ లక్ష్యమని, మహిళల సంక్షేమమే తమ బాధ్యత అని అన్నారు. మతాలకు అతీతంగా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, పండుగ ఆనందం ప్రతి ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. అలాగే ముస్లిం సోదర సోదరీమణులందరికీ మొహరం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు పాలడుగుల సందీప్ రెడ్డి, మహిళా గ్రూప్ ఆర్పీ కీర్తి తదితరులు పాల్గొన్నారు.




