📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetమొహమ్మద్ షాదుల్‌కు మైనార్టీ కోటాలో కో-ఆప్షన్ పదవి ఇవ్వాలి- చేల్లాపూర్ వార్డు ప్రజలు..

మొహమ్మద్ షాదుల్‌కు మైనార్టీ కోటాలో కో-ఆప్షన్ పదవి ఇవ్వాలి- చేల్లాపూర్ వార్డు ప్రజలు..

📰 Generate e-Paper Clip

మొహమ్మద్ షాదుల్‌కు మైనార్టీ కోటాలో కో-ఆప్షన్ పదవి ఇవ్వాలి- చేల్లాపూర్ వార్డు ప్రజలు

షాదుల్ సేవలకు స్పందించండి! మైనార్టీ కోటా కో-ఆప్షన్ పదవి ఇవ్వండి!

దుబ్బాక మైనార్టీ యూత్ అధ్యక్షుడికి న్యాయం చేయండి!

సిద్దిపేట్, దుబ్బాక, మార్చి 24,ప్రజావాణి

బీఆర్ఎస్ పార్టీకి అంకితభావంతో సేవలు అందించిన దుబ్బాక మున్సిపల్ మైనార్టీ యూత్ అధ్యక్షుడు మొహమ్మద్ షాదుల్‌కు పార్టీ పెద్దలు మైనార్టీ కోటాలో కో-ఆప్షన్ పదవి కల్పించాలి. దివంగత నేత మాజీ ఎమ్మెల్యేఅంచనాల కమిటీ చైర్మన్ గా సోలిపేటరామలింగారెడ్డి గతంలోనే మహమ్మద్ షాదుల్ కు మైనారిటీ కోటాలో నామినేటెడ్ పదవి ఇచ్చే క్రమంలో కొందరు అడ్డుపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా అపార సేవలు చేసిన మహమ్మద్ షాదుల్, గులాబీ దళపతి ,తెలంగాణ జాతి పిత కేసీఆర్‌,హరీష్‌ రావు అభిమాని మరియు కేపీఆర్ సైనికుడు.పార్టీ ఉద్యమాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని కుటుంబాన్ని విడిచి ఉద్యమాల్లో తనదైన శైలిలో పనిచేసి నిలిచి స్వరాష్ట్రం కోసం కష్టపడిన కార్యకర్తలకే పదవులు ఇస్తే బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుంది. జెండా మోసినవారికి కాకుండా, పార్టీకి ఎనలేని సేవలు చేసినవారికి ప్రాధాన్యత ఇవ్వాలిఅని చెల్లపూరు వార్డు ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular