📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణBhadradri Kothagudemమొండికుంట–అశ్వాపురం మార్గంలో 7 కిలోల ఎండు గంజాయి పట్టివేత మన...

మొండికుంట–అశ్వాపురం మార్గంలో 7 కిలోల ఎండు గంజాయి పట్టివేత మన ప్రజావాణి ప్రతినిధి

📰 Generate e-Paper Clip

మొండికుంట–అశ్వాపురం మార్గంలో 7 కిలోల ఎండు గంజాయి పట్టివేత

 

మన ప్రజావాణి ప్రతినిధి

పినపాక నియోజకవర్గం

ఫిబ్రవరి 11 :

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం భారీగా గంజాయి పట్టివేశారు.

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి. జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి. గణేష్, ఈఎస్ కె. తిరుపతి ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ సీఐ సిహెచ్. శ్రీహరిరావు ఆధ్వర్యంలో సిబ్బంది మొండికుంట నుంచి అశ్వాపురం వెళ్లే మార్గంలో కేవీఆర్ ఫంక్షన్ హాల సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు.

 

ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో 7 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.

 

ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు

 

ఈ ఘటనలో

ఏ-1 బడేటి వెంకటేష్ (తండ్రి: కృష్ణ, నివాసం: తెల్లబెల్లి, సూర్యాపేట జిల్లా)

ఏ-2 మోరుబోయిన గోపయ్య (తండ్రి: నాగరాజు, నివాసం: వెంగనాయకునిపాలెం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్)

అనే ఇద్దరిని అరెస్టు చేశారు

 

వారి వద్ద నుంచి 7 కిలోల ఎండు గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 4,60,000గా అధికారులు అంచనా వేశారు.

 

తదుపరి విచారణ నిమిత్తం పట్టుబడిన గంజాయి, వాహనం, సెల్ ఫోన్‌తో పాటు ఇద్దరు ముద్దాయిలను మణుగూరు ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.

 

ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఎంఏ కరీం, కానిస్టేబుల్స్ సుధీర్, వెంకట్, వీరబాబు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular