ప్రజావాణిన్యూస్(మార్చి23)మైదుకూరుకడపజిల్లా.ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మైదుకూరు అర్బన్ పరిధిలోని లాడ్జీలు మరియు డార్మిటరీలను ఆదివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి,అక్కడ పరిస్థితులను పరిశీలించిన మైదుకూరు అర్బన్ సి.ఐ రమణా రెడ్డి,SI కత్తి వెంకటరమణ మరియు సిబ్బంది. లాడ్జీల్లోనీ కార్యకలాపాలపై నిఘా.అసాంఘిక,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ.గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా/ వినియోగం అరికట్టుట.రికార్డులు నిర్వహణ మరియు సీసీటీవీ కెమెరాలు పనితీరు పరిశీలన.గెస్టుల వివరాలు మరియు వారు లాడ్జిలో బసచేయుటకు గల కారణాలపై ఆరా.లాడ్జీల్లోని ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి,లాడ్జిలలో,డార్మిటరీ లలో బస చేసిన వ్యక్తుల వివరాలను పరిశీలించి, కొత్త వ్యక్తులు మరియు అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ,వారి వేలిముద్రలను ఫింగర్ ప్రింట్ పరికరాల ద్వారా పరిశీలిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. లాడ్జీలలో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహిస్తున్నారా.సీసీటీవీ కెమెరాల నిర్వహణ సరిగా ఉన్నదా.అని ఆరా తీసి,సరైన గుర్తింపు కార్డులు/ఆధారాలు ఉన్నవారికి మాత్రమే రూములను ఇవ్వాలని,అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారికి ఎవరికీ రూముల ఇవ్వరాదని,లాడ్జి పరిసరాలు స్పష్టంగా కన్పించేలా తప్పనిసరిగా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ఆ సమాచారాన్నీ పోలీసుల వారికి అందించాలని, డార్మిటరీస్, లాడ్జిల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా లాడ్జీల నిర్వాహకులకు మైదుకూరు అర్బన్ సి.ఐ రమణా రెడ్డి హెచ్చరించారు.జిల్లా పోలీస్ కార్యాలయం, .
మైదుకూరు లాడ్జీల్లోనీ కార్యకలాపాలపై నిఘా.
0
15
- Advertisment -



