📄 ePaper
Monday, March 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మేము వైయస్ జగన్ విశ్వాస పాత్రులం... మమ్ములను కుక్కలతో పోల్చిన సంతోషమే. రెడ్యo

మేము వైయస్ జగన్ విశ్వాస పాత్రులం… మమ్ములను కుక్కలతో పోల్చిన సంతోషమే. రెడ్యo

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి24)దువ్వూరు జగన్ కు దమ్ము,ధైర్యం లేక కాదు మానవత్వం ఉండబట్టే జవాబు ఇవ్వలేదు.మేము సైతాన్ సైన్యం కాదు,జగనన్న సైన్యం అందుకే వాస్తవాలను ధైర్యంగా మాట్లాడుతున్నాo.ఈటీవీ,ఏబీఎన్ ప్రసారాలపై షర్మిలమ్మ,సునీతమ్మ ఎందుకు మాట్లాడటం లేదు.వైయస్ అవినాష్,రాచమల్లు ల వ్యాఖ్యల కు జవాబు చెప్పలేకే అసందర్భంగా ప్రేలాపనలు.పీసీసీ చీఫ్ షర్మిలమ్మ పై వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యo ఫైర్.వైఎస్ విజయమ్మ తల్లిగా వైఎస్ జగన్ తో మాట్లాడే చనువు,బాధ్యత ఉన్నప్పటికీ మాట్లాడకుండా జగన్ రాజకీయ పతనాన్ని కోరి.షర్మిలమ్మను రక్షించేందుకు మద్దతుగా విజయమ్మ స్టేట్మెంట్ కు నోటరీ చేసి విడుదల చేయడం కూటమినేతల కుట్రలో భాగమని,ఉన్న వాస్తవాలను వైయస్ జగన్ విశ్వాస పాత్రులoగా వైఎస్ కుటుంబ కీర్తి మసకబారకూడదనే సదుద్దేశంతో మేము మాట్లాడామని అలాంటి మమ్ములను కుక్కలు మొరుగుతున్నాయి అంటూ విశ్వాసానికి మారు పేరైన కుక్కలతో పోల్చడం సంతోషదాయకమే గానీ మీలాంటి చెల్లెళ్లతో పోల్చకపోవడం అత్యంత సంతోషదాయకమని వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యo వెంకటసుబ్బారెడ్డి పిసిసి చీఫ్ షర్మిలమ్మ పై ఫైర్ అయ్యారు. దువ్వూరు మండలం,గుడిపాడు గ్రామంలోని దువ్వూరు సింగల్ విండో మాజీ చైర్మన్ తుమ్మల మస్తాన్ రెడ్డి స్వగృహంలో మంగళవారం రెడ్యo విలేకరులతో మాట్లాడుతూ పిసిసి చీఫ్ షర్మిలమ్మ విజయవాడలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ నిస్సిగ్గుగా అబద్దాలను నీచ,నికృష్ట భాషతో మాట్లాడటం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు.తండ్రి చనిపోయినా ఆస్తి లో తన చెల్లెలు కి వాటా ఇచ్చే అన్నదమ్ములు ఉంటారని,తన సొంత ఆస్తిలో వాటా ఇచ్చే ఏకైక అన్న వైఎస్ జగన్ మాత్రమే కానీ.షర్మిలమ్మకు జగన్ సొంత వాటా ఇచ్చినా ధన దాహం.ఆస్తి దాహం తీర లేదని,షర్మిలమ్మ, ఆమెకు అండగా విజయమ్మ ఇష్టం వచ్చినట్లు గ్లోబెల్స్ మించి వైయస్ జగన్ పై విష ప్రచారం చేయడం,అబద్దాలను శత్రువులకు మించి మాట్లాడినా వారిపై మానవత్వం,ప్రేమ,అభిమానం ఉండబట్టే జగన్ వారికి జవాబు ఇవ్వడం లేదని,దమ్ము,ధైర్యం లేక కాదన్న నగ్న సత్యాన్ని గుర్తించి మసులుకోవాలని వారికి ఆయన వారికి హితవు పలికారు. మీరు వైయస్ జగన్ పైనే కాకుండా.వాస్తవాలు మాట్లాడే మాలాంటి వారిని సైతాన్ తో పోల్చడం సిగ్గుచేటని మేము సైతాన్ సైన్యం కాదని,జగనన్న సైన్యం కాబట్టే వాస్తవాలను నిర్భయంగా,నీతి,నిజాయితీ తో మాట్లాడుతున్నామని ఆయన పేర్కొన్నారు.వివేక హత్యపై జగన్,వైయస్ భారతి లు నిజం ఏమిటో చెప్పాలని షర్మిలమ్మ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని,దీనిపై నిజమేమిటో డా|| నర్రెడ్డి సునీతమ్మ ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.నలుగురు మనమల్లు,మనమరాల్లకు ఆస్తిని సమానంగా పంచాలని డా||వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు విజయమ్మ దేవుడు సాక్షిగా ప్రస్తావించారని షర్మిలమ్మ వెలువరించడం దుర్మార్గమని,ఆ వాటా వైయస్ఆర్ ఉన్నప్పుడే పంచారని.షర్మిలమ్మ బ్లాక్ మెయిల్ తోనే విజయమ్మ లాంటి గొప్ప మహిళలతో అబద్ధాలు ఆడిస్తోందని ఆయన నిశితంగా విమర్శించారు. వివేక మరణం పై సాక్షి చానల్లో గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారని పదే పదే చెప్పే సునీతమ్మ,షర్మిలమ్మ లు ఆనాడు ఏబిఎన్ లో తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూసిన వైయస్ వివేకా అని,ఈటీవీలో వైయస్ జగన్ చిన్నాన్న వైయస్ వివేకనంద రెడ్డి హఠాన్మరణం అంటూ చేసిన ప్రచారాలపై ఎందుకు నిలదీయరని.ఎందుకు ప్రశ్నించరని.ఆయన సూటిగా ప్రశ్నించారు. కడప పార్లమెంట్ సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డి ,ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు,వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై షర్మిలమ్మ జవాబు ఇవ్వలేక అసందర్భం ప్రేలాపనలు, అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు.నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిపినా,నారా రామమూర్తి నాయుడు తన అన్న చంద్రబాబు నాయుడు పై పోటీకి సై అన్నా,ఎన్టీఆర్ పై కుటుంబ సభ్యులంతా తిరుగుబాటు చేసినా… చెప్పులు వేయించినా,నందమూరి హరికృష్ణ సొంత పార్టీ పెట్టినా,ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య చేసుకుని మరణించినా అవి వారి సొంత సమస్యలని నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గానీ,నేడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గానీ ఏనాడు నోరు మెదపలేదని నేడు జగన్ కుటుంబం ఆస్తి గొడవల్లో ఎల్లో మీడియా ఛానల్లు కూటమినేతల ప్రమేయంతో తలదూరుస్తూ,విషం చిమ్ముతున్నారని వారి కుటుంబ సమస్యలు వారు వారు తేల్చుకుంటారని మధ్యలో మీకెందుకని ఆయన నిలదీశారు.ఏనాటికైనా వాస్తవాలు బయట పడతాయని…నిజం నిప్పు లాంటిదని ఆయన పేర్కొంటూ వైయస్ జగన్ ఎప్పటికైనా కడిగిన ముత్యంలా ప్రజల గుర్తిస్తారని.జగన్ విజయాన్ని ఎవరు ఆపలేరని.. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం అంతే వాస్తవం అని రెడ్యo విశదీకరించారు.విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సిపి నేతలు గుడిపాడు సర్పంచ్ రాజుపాలెం మాబు షరీఫ్,కమ్మర సుబ్బనాచారి,ఎర్రగుంట్ల నాగమోహన్ రెడ్డి,ఇచ్చు కత్తుల మహమ్మద్ గౌస్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular