📄 ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మా పిల్లల భవిష్యత్తు ఏది? ఎస్సీ హోదా కోసం బుడగజంగాల పోరుబాట!

మా పిల్లల భవిష్యత్తు ఏది? ఎస్సీ హోదా కోసం బుడగజంగాల పోరుబాట!

📰 Generate e-Paper Clip

కడపజిల్లాప్రజావాణిన్యూస్ఏప్రిల్10) కడపమా పిల్లల భవిష్యత్తు ఏది? ఎస్సీ హోదా కోసం బుడగజంగాల పోరుబాట!విద్యార్థుల బలిదానాలు ఇంకెన్నాళ్ళు.ఏప్రిల్ 17న ‘చలో నంద్యాల’ను జయప్రదం చేయండి-బేడ బుడగజంగం సంక్షేమ సంఘం పిలుపు,తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు మరియు రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం ఏప్రిల్ 17న నంద్యాలలో నిర్వహించ తలపెట్టిన చలో నంద్యాల బహిరంగ సభను విజయవంతం చేయాలని బేడ బుడగజంగం సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం కడప నగరంలోని 48వ డివిజన్ బుడగజంగం కాలనీలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసి,ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు దూపం రాజు,డి.శ్రీరాములు,చిత్తారి రామయ్య మరియు విద్యార్థి సంఘం నాయకులు పోనపు రవితేజ వీరు మాట్లాడుతూ బేడ బుడగజంగం కులస్తుల దశాబ్దాల పోరాటాన్ని వివరించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బుడగజంగం కులాన్ని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో చేర్చారని,అయితే 2002లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా విధించిన ప్రాంతీయ పరిమితుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని బుడగ జంగాలకు ఎస్సీ హోదా తొలగించబడి తమకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో అసెంబ్లీలో మూడుసార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినప్పటికీ,నేటికీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపిన నేపథ్యంలో,కేంద్రం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల నేడు బుడగజంగం విద్యార్థులు విద్య,ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోతు,కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వివక్షకు చలో నంద్యాల సభతో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.ఏప్రిల్ 17న నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు జరిగే ఈ భారీ బహిరంగ సభకు ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.ఈ సభ ద్వారా తమ గళాన్ని ఢిల్లీకి వినిపించేలా భారీ సంఖ్యలో బుడగ జంగం కుల బాంధవులు తరలిరావాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్ళు టి.జమక్క,హుస్సేనమ్మలు కాలనీ వాసులు,కుల పెద్దలు మరియు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular