మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన సన్మానం
బెజ్జంకి, ఏప్రిల్ 10(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి రెవెన్యూ శివారులో గల గూడెం గ్రామపంచాయతీ పరిధిలో 63 ఎకరాల 18 గుంటల భూమి సమస్య పరిష్కారంలో భాగంగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన కృషిని గుర్తిస్తూ ఆయనను ఘనంగాసన్మానించారు.ఆర్టీఐ ప్రచార కమిటీ ఫౌండర్ మరియు చైర్మన్ రాచూరి మల్లికార్జున్, ఎక్స్ పీ
ఏసి ఎస్ చైర్మన్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి ఆధ్వర్యంలోనియోజకవర్గంలోని ప్రజాభవన్‌లో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.గూడెం గ్రామంలో గత ప్రభుత్వం నిరుపేద దళిత కుటుంబాలకు 63 ఎకరాల 18 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి 35 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ, గత ఎనిమిదేళ్లుగా భూసర్వే మరియు మ్యూటేషన్ ప్రక్రియలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ సమస్యను రాచూరి మల్లికార్జున్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించారు.ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే జిల్లా కలెక్టర్ నూతన రెవెన్యూ యంత్రాంగంతో సమన్వయం చేసి భూసర్వే, మ్యూటేషన్ ప్రక్రియలను పూర్తి చేయించి లబ్ధిదారులకు పట్టాదారుల హక్కులు కల్పించారు. దీంతో దళిత కుటుంబాలకు న్యాయం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానిస్తూ నిర్వాహకులు, లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా భూములకు విద్యుత్ సదుపాయం, వ్యవసాయ బావుల మంజూరుపై వినతిపత్రం అందజేయగా, వాటిని తప్పకుండా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే మండలంలో పెండింగ్‌లో ఉన్న ఇతర భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సముద్రాల లక్ష్మణ్, రెడ్డిగాని రాజు, మామిడి అనిల్, మీసాల అంజయ్య, బోయిని కొమురయ్య, ఎలుక రాజు, మాతంగి లక్ష్మణ్, కన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




