📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetమద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష...

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష…

📰 Generate e-Paper Clip

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష…

సిద్దిపేట జిల్లా,ప్రజావాణి

సిద్ధిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా ఒక వ్యక్తి మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా గురువారం సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి ముందు హాజరుపరచగా విచారణ చేసి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు.జైలు శిక్ష విధించిన వ్యక్తి వివరాలు.గడ్డం అనిల్ కుమార్ , తండ్రి వెంకటయ్య , నాచారుపల్లి నివాసం, సిద్దిపేట జిల్లాఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ల ని కట్టడి చేయడానికి, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాళ్ల కి ప్రమాదం రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమని ప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ విచారణ జరిపి 10 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular