ఘట్కేసర్, జూలై 10: ఎంఎంసీ ఘట్కేసర్ 6వ డివిజన్‌కు చెందిన ఘట్కేసర్ వాసి బ్యారం బుచ్చమ్మకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2,25,000ల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును శుక్రవారం అందజేశారు.
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుగురి మాచెందర్ రెడ్డి లబ్ధిదారురాలికి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొలుగురం రాము తదితరులు పాల్గొన్నారు.




