వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2007-08 విద్యాసంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ… బాల్యంలోని మధుర స్మృతులు ఎప్పటికీ మరువలేనివని, చాలా ఏళ్ల తర్వాత సహచర విద్యార్థులను, గురువులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ వేడుకలో పూర్వ ఉపాధ్యాయులు రామయ్య, ఇల్లవుదిన్, మారుతీ, మనోహర్, చిలుకయ్య, వసంత్ రావులతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
బాల్య స్మృతులు మరువలేనివి, చెగ్యాం జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
RELATED ARTICLES




