📄 ePaper
Wednesday, April 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బాబు బాబు జగ్జీవన్ రామ్ కి భారతరత్న ప్రకటించాలి. -మదర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు...

బాబు బాబు జగ్జీవన్ రామ్ కి భారతరత్న ప్రకటించాలి. -మదర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావు

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1)రెడ్డిగూడెం,బాబు బాబు జగ్జీవన్ రామ్ కి భారతరత్న ప్రకటించాలి.మదర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావు,భారతదేశానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన సమతా వాదిమహానేత బాబు జగజీవన్ రామ్ కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించాలని మదర్ సర్వీస్ సొసైటీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వానికి పత్రిక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ,కేంద్రమంత్రిగా,ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో దేశానికి ఎనలేని సేవలో అందించారని ఆయన కొనియాడారు. సమానత్వం,సామాజిక న్యాయం,ప్రజాస్వామ్య విలువలను బలపరచడంలో జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అపూర్వం అని ఆయన సేవలను కొనియాడారు.ఇలాంటి మహనీయుడికి ఇప్పటివరకు భారతరత్న ప్రకటించకపోవడం చాలా బాధాకరం అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జగ్జీవన్ రామ్ సేవలను గుర్తించి తక్షణమే భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని డాక్టర్ మల్లాది ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.మహానేతల సేవలను గౌరవించడం ద్వారా సమాజానికి స్ఫూర్తి కలిగించవచ్చని,బాబు జగ్జీవన్ రామ్ కి భారతరత్న ఇవ్వడం సమాజానికి ఒక గొప్ప సందేశమని సామాజిక కార్యకర్త డాక్టర్ మల్లాది ప్రసాదరావు పేర్కొన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బాబు జగజ్జివన్ రావు కి భారతరత్న ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular