📄 ePaper
Wednesday, May 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బహుజన రాజకీయ ఉద్యమ శిల్పి మాన్యశ్రీ కాన్సిరాం - బహుజన్ సమాజ్ పార్టీ బర్రె.ఉదయ్...

బహుజన రాజకీయ ఉద్యమ శిల్పి మాన్యశ్రీ కాన్సిరాం – బహుజన్ సమాజ్ పార్టీ బర్రె.ఉదయ్ కిరణ్

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి15)కంచికచర్ల దేశ పార్లమెంట్ భవనంలో సబ్బండ కులాలు అడుగులు వేయించిన నాయకుడు కాన్సిరాం.భారతదేశ రాజకీయ చరిత్రలో విస్మరించబడిన బహుజన కులాలకు స్థానం కల్పించిన రాజకీయ దురంధరుడు కాన్షిరం.ఘనంగా జరిగిన బీఎస్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన్యశ్రీ కాన్షీరాం 92వ జయంతి వేడుకలు.బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ కాన్సిరాం 92వ జయంతి కార్యక్రమం ఈరోజు స్థానిక కంచికచర్లలోని అంబేద్కర్ సెంటర్ నందు యూత్ నాయకులు బడుగు కోటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమమునకు బర్రె ఉదయ్ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మొదటగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్,కాన్షీరాం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి అనేక కులాలను దగ్గరకు చేర్చుకొని బహుజన కులాలుగా మార్చి అధికారపు సింహాసనం మీద కూర్చోబెట్టిన గొప్ప రాజకీయ ఉద్యమ శిల్పి మాన్యశ్రీ కాన్షీరాం అన్నారు.ఓటుకి నోటు పంచుతూ ఓటర్లకు చీపులికరు పంచుతూ ఓటర్లను బానిసలుగా చేసిన రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బీఎస్పీ పార్టీని స్థాపించి అదే ఓటర్లను వారిని బానిసలుగా మార్చిన రాజకీయ పార్టీల గుండెల మీద ఏనుగు అంబారీ ద్వారా ఊరేగించి రాజ్యాధికార పు సింహాసనం మీద కూర్చోబెట్టిన గొప్ప అంబేద్కర్ వారసుడు కాన్షీరాం అని అన్నారు.రాజకీయ అధికారమే సామాజిక మార్పుకు మాస్టర్ కి అనే మహత్తర ఆలోచనతో దేశవ్యాప్తంగా దళితులను,ఆదివాసీలను,ఇతర వెనుకబడిన వర్గాలను మరియు మైనార్టీలను ఓకే బహుజన శక్తిగా ఏకం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.నేటి బహుజన యువత కాన్షిరం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాధికార పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు జంగా తిరుపతిరావు,కిరణ్,గారపాటి వంశీ,నూతన్,కిషోర్,కాటూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular