ప్రజావాణి న్యూస్ : (మార్చి 08) బద్వేల్ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, గౌరవ మున్సిపల్ కమీషనర్ గారి ఆదేశాల మేరకు, ఈరోజు బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26” పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది.కార్యక్రమ ముఖ్యాంశాలు:కమీషనర్ గారి ఆదేశాల అమలు: పట్టణ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంలో
భాగంగా,ప్రజలందరినీభాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముగ్గుల ద్వారా సందేశం: “BMC SS 2026” అని ముగ్గులతో అలంకరించి, స్వచ్ఛ సర్వేక్షన్లో బద్వేల్ అగ్రస్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరడం జరిగింది. చెత్త సేకరణపై అవగాహన: వ్యర్థాలను మూడు రకాలుగా విభజించడంపై (తడి, పొడి మరియు హానికర వ్యర్థాలు) ప్రజలకు వివరించారు: రెడ్ బిన్: హానికర వ్యర్థాలు (మాస్కులు, సిరంజీలు). గ్రీన్ బిన్: తడి చెత్త (కూరగాయల వ్యర్థాలు, ఆహారం).
బ్లూ బిన్: పొడి చెత్త (ప్లాస్టిక్, కాగితం). ప్రజా ప్రతిజ్ఞ: ప్లాస్టిక్ రహిత బద్వేల్ నిర్మాణానికి మరియు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఉండటానికి అందరం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం.మన బాధ్యత:గౌరవ మున్సిపల్ కమీషనర్ గారి పిలుపు మేరకు, మన ఇంట్లోనే చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందజేద్దాం. మన బద్వేల్ను ఆదర్శవంతమైన స్వచ్ఛ పట్టణంగా మారుద్దాం!
కమీషనర్, బద్వేల్ పురపాలక సంఘం



