📄 ePaper
Wednesday, April 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్

📰 Generate e-Paper Clip

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్

ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు

ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

మేడిపల్లి ఏప్రిల్ 14 (మన ప్రజావాణి)బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు అన్నారు.మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించరు.ఈ సందర్భంగా ఫెడరేషన్  కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ రాపోలు రాములు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్  భారత దేశానికి అందించిన సేవలు అమూల్యమైనవని, సామాజిక అసమానతలు,  ఉండకూడదని,ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలను,కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని,ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి, అధ్యక్షుడు అబ్రహం లింకన్, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ గుప్తా,ఫెడరేషన్ సభ్యులు వివిధ కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular