📄 ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన బెజ్జంకి మండల వ్యవసాయ అధికారి...

ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన బెజ్జంకి మండల వ్యవసాయ అధికారి సంతోష్

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,జూన్ 15(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఫర్టిలైజర్, విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణదారులకు పలు సూచనలు చేశారు.రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయించరాదని, దుకాణాల్లో స్టాక్ బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ప్రతి కొనుగోలు చేసిన రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు.
విత్తనాల నాణ్యతను నిర్ధారించేందుకు నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను మాత్రమే కొనుగోలు చేసి బిల్లులు భద్రపరుచుకోవాలని వ్యవసాయ అధికారి సంతోష్ సూచించారు.

Previous article
Next article
ముగిసిన అఖండ అధికమాస హరినామ సప్తహ బీర్కూరు మండల కేంద్రంలోని విట్ఠలేశ్వర ఆలయంలో సోమవారం పురుషోత్తమ మాస అమావాస్య సందర్భంగా పురస్కరించుకొని అఖండ హరినామ సప్తహ నిర్వహకులు ముగింపు నిర్వహించారు. విఠలేశ్వర ఆలయంలో నెల రోజులపాటు మహారాష్ట్ర, బాన్సువాడ నియోజకవర్గ, తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తవార్కారులు విచ్చేసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు కాకడ హారతి, హరి పాట్ హరి జాగరణ, కాల కీర్తన తదితర కార్యక్రమాలు నిర్వహించేవారు. సోమవారం సోమవతి అమావాస్య సందర్భంగా అఖండ హరినామ సప్తహ ముగింపు కార్యక్రమంలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాల కీర్తన హ,భ,ప పిరాజీ మహారాజ్ ఆధ్వర్యంలో కాల కీర్తన నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బీర్కూర్ పరిసరాల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికమాస సప్తహ కార్యక్రమం ముగింపు నిర్వహించారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular