కడపప్రజావాణిన్యూస్(మార్చి27) ప్రొద్దుటూరు.అంటే.అదొక ఆధ్యాత్మికతకు,వ్యాపార దక్షతకు మారుపేరైన ప్రొద్దుటూరు గడ్డపై ఇప్పుడు మరణ మృదంగం వినిపిస్తోంది.చెట్టుకు వెన్న పోసినా చేదు పోనట్లు.ఎన్ని చట్టాలు వచ్చినా,ఎంతటి నిఘా ఉన్నా.సురేంద్ర నాధుడు అనే మత్తు పదార్థాల డాన్ ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది.కేవలం కాసుల కక్కుర్తి కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతూ,ప్రొద్దుటూరు ఇంటింటికీ.క్యాన్సర్.అనే మహమ్మారిని పంపిణీ చేస్తున్నాడు ఈ అక్రమ వ్యాపారి.మత్తు చిమ్మే విషనాగు.క్యాన్సర్ కేరాఫ్ అడ్రస్ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.అంటారు పెద్దలు.కానీ.సురేంద్ర నాధుడు విక్రయించే ఈ నిషేధిత,నాసిరకం మత్తు పదార్థాలు నోటిని విషతుల్యం చేస్తున్నాయి.ఐదు రూపాయల మత్తు ప్యాకెట్‌ను ఇరవై రూపాయలకు అమ్ముతూ,యువతను వ్యసనాల ఊబిలోకి నెట్టడమే కాకుండా.వారిని నేరుగా క్యాన్సర్ వార్డుల వైపు నడిపిస్తున్నాడు..తినే తిండిలో విషం కలిపినట్లు, ఈ గుట్కా రక్కసి వల్ల వేల మంది నోటి క్యాన్సర్ బారిన పడి విలవిల్లాడుతున్నారు.ఈ డాన్ సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఒక పేదవాడి ప్రాణం,ఒక కుటుంబం కన్నీరు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.రాజ్యాధికారం.అక్రమ సామ్రాజ్యం.గతంలో రహస్యంగా సాగిన ఈ చీకటి వ్యాపారం, ఇప్పుడు ప్రభుత్వ అనుమతుల ముసుగులో విచ్చలవిడిగా సాగుతోంది..అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు.. అన్న సామెతను ఇతగాడు తన అక్రమాలకు వాడుకుంటున్నాడు.అధికారుల కళ్ళు గప్పి,జీఎస్టీ ఎగవేసి, దాదాపు రెండు కోట్ల విలువైన మత్తు నిల్వలను రహస్య గోదాముల్లో దాచిన తీరు విస్మయం కలిగిస్తోంది.అధికారుల లోపాయికారీ ఒప్పందం.నిఘా వర్గాలు దాడులకు సిద్ధపడితే,ఒక ముఖ్య పార్టీ నేతల అండతో,అమ్యామ్యాలతో వ్యవస్థలనే మేనేజ్ చేస్తున్నాడు..కాసుల కోసం కళ్ళు మూసుకునే.. అధికారుల తీరు ఈ డాన్‌కు మరింత బలాన్నిస్తోంది.చిన్న వ్యాపారుల గొంతు కోస్తూ.పెద్ద చేప చిన్న చేపను మింగినట్లు..ప్రొద్దుటూరులో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్నాడు.తన వద్ద సరుకు కొనని చిన్న వ్యాపారులను బెదిరించడం,వారు బయట నుంచి తెచ్చుకుంటే ధరలు తగ్గించి వారిని నష్టాల పాలు చేయడం ఇతని నైజం.ధరల మాయాజాలం.పోటీదారులను దెబ్బతీయడానికి రూ.150 ప్యాకెట్‌ను రూ.100 లకే ఇచ్చి,చిరు వ్యాపారులు సరుకు అమ్మడం మానేశాక అదే ప్యాకెట్‌ను రూ.170 కి పెంచి సామాన్యులను దోచుకుంటున్నాడు.ఇది వ్యాపారం కాదు,పక్కా.రక్తపాతం.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.కాకుండా,ఈ మత్తు పదార్థాల డాన్ సురేంద్ర నాథుడు అక్రమ సామ్రాజ్యంపై ప్రభుత్వం,పోలీసులు తక్షణమే ఉక్కుపాదం మోపాలి.ప్రొద్దుటూరును క్యాన్సర్ కోరల నుండి కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
ప్రొద్దుటూరును మత్తు.మాఫియా.పంజా.సురేంద్ర నాధుడు అనే మత్తు పదార్థాల డాన్
0
6
- Advertisment -



