📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మిక తనకి...

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మిక తనకి…

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా,మార్చి 6, ప్రజావాణి

దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మీ ఆసుపత్రిలో పాత పెండింగ్ పైల్స్ క్లియర్ చెయ్యాలని మునుపటికి క్లియర్ చేశాక ఫోటోగ్రఫీ తీసుకుని డాక్యుమెంట్ చెయ్యాలని, 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో రోజు ఏఏ కార్యక్రమాల నిర్వహణ గూర్చి ప్రజలకు తెలిసేలా బయట ఒక బ్యానర్ పెట్టుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. అటెండెన్స్ రిజిస్టర్ ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. ఆసుపత్రి సిబ్బంది సమయ వేళలు పాటిస్తున్నారా ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించేలా కృషి చేయాలని ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular