📄 ePaper
Saturday, July 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకం – బద్వేల్ డివిజన్ ఆర్డీఓ శ్రీ...

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకం – బద్వేల్ డివిజన్ ఆర్డీఓ శ్రీ ఎ. చంద్రమోహన్

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి బద్వేల్ డివిజన్ ఆర్డీఓ శ్రీ ఎ.చంద్రమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆర్డీఓ  మాట్లాడుతూ,విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై,నాణ్యమైన విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం,నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు,విద్యార్థుల హాజరు,విద్యా ప్రమాణాల పెంపు వంటి అంశాలపై తల్లిదండ్రులతో ఆర్డీఓ చర్చించారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలలు,తల్లిదండ్రులు,అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) శ్రీ విజయ్ కుమార్,ఎంఈఓ శ్రీ ఓబులేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటయ్య,ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular