📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పెండ్లిమర్రి మండలం నిరుపేదలకు భూ పంపిణీ అమలు చేయాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి...

పెండ్లిమర్రి మండలం నిరుపేదలకు భూ పంపిణీ అమలు చేయాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మార్చి12)పెండ్లిమర్రి మండలం నిరుపేదలకు భూ పంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్ జిల్లా సహాయ కార్యదర్శి సురేష్ బాబు డిమాండ్ చేశారు.గురువారం ఉదయం స్థానిక తాసిల్దారు కార్యాలయం ఎదుట పెండ్లిమర్రి గంగనపల్లె మాచునూరు గ్రామాలకు చెందిన దళితులు పేదలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారుఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అన్వేష్ కార్యదర్శి సహాయ కార్యదర్శి సురేష్ బాబు మాట్లాడుతూమండలంలో భూమి లేని నిరుపేదలకు 14 సంవత్సరాల నుంచి పరిపాలించిన టిడిపి వైసిపి ప్రభుత్వాలు సెంటు భూమి అసైన్మెంట్ కమిటీ ద్వారా పంపిణీ చేపట్టలేదని అన్నారు రాజకీయ పలుకుబడి కలిగిన నాయకులు ధనవంతులు స్థానికేతర్లు వందల ఎకరాలు దొంగ పట్టాలు పాసుబుక్కులు ఆన్లైన్లో చేయించుకొని ఎస్టేట్లో నిర్మించుకున్నారు అన్నారుఅన్యక్రాంతమైన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలని భూమి లేని నిరుపేదలందరికీ భూ పంపిణీ అమలు చేయాలని కోరారుఅదేవిధంగా గత పది సంవత్సరాలు పైగా ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు సాగులో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యధావిధిగా అమలు చేయాలని కోరారుగ్రామాలలో కూలీలకు వెంటనే ఉపాధి పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుఈనెల 14వ తేదీ శనివారం కడప నగరంలో జిల్లాలో భూ పంపిణీ అమలు చేయాలని జిల్లా భూ సదస్సు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారుఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శీను మల్లేష్ ఉత్తయ్య సుంకమ్మ మాచునూరు గ్రామం గంగనపల్లె గ్రామాల నుంచి భూమి లేని నిరుపేదలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular