📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పారదర్శకంగా బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టిన కడప జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్...

పారదర్శకంగా బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టిన కడప జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్

📰 Generate e-Paper Clip

 

వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్ (మే05) పారదర్శకంగా బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టిన కడప జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్  54 మంది పోలీసులకు బదిలీలు సాధారణ బదిలీల్లో భాగంగా మంగళవారం వై.ఎస్.ఆర్ కడప జిలాలోని పోలీస్ స్టేషన్లలో ఒకే చోట 5 ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందికి బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టినట్లు జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియకు 5 మంది ఏ.ఎస్.ఐ లు,17 మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 32 మంది కానిస్టేబుళ్లు మొత్తం 54 మంది కౌన్సిలింగ్ కు హాజరయ్యారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ సిబ్బందితో మాట్లాడారు.పలు సూచనలు చేశారు.ఒకే పోలీస్ స్టేషన్ లో 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న పోలీసులకు నిబంధనల ప్రకారం పారదర్శకంగా బదిలీల ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు.తమ సొంత మండలం కాకుండా ఇతర పోలీస్ స్టేషన్ లు ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఖాళీల ఆధారంగా ఉన్న పోలీస్ స్టేషన్లను ఎంచుకోవాలని సూచించారు.పోలీసు సిబ్బంది కి కోరుకున్న చోటుకే బదిలీలు జరగడంతో బదిలీల పట్ల పోలీస్ సిబ్బంది అందరూ ఆనందం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పీ (అడ్మిన్) శ్రీ కె.ప్రకాష్ బాబు,స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పీ శ్రీ ఎన్.సుధాకర్,జిల్లా పోలీస్ కార్యాలయ ఏ.ఓ శ్రీమతి సుజాత,సూపరింటెండెంట్ శ్రీనివాస నాయక్, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్,డి.పీ.ఓ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular