సిద్దిపేట జిల్లా, మర్కుక్, మార్చి 9, ప్రజావాణి
సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి ప్రాంతంలోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల ముందు పరిసర ప్రాంతాలలో సోమవారం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో గ్రామపంచాయతీ సపాయి కార్మికులు, నర్సమ్మ, పోచయ్య, అక్కరం పోచయ్య,
పాఠశాల ఆవరణను శుభ్రపరిచారు. పాఠశాల ముందు పేరుకుపోయిన చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..సర్పంచ్ భవాని, బాలకిషన్, గ్రామపంచాయతీ, విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు.ఇలాంటి శుభ్రత కార్యక్రమాలు తరచూ నిర్వహించడం ద్వారా పాఠశాలలు గ్రామ పరిసరాలు ఆరోగ్యకరంగా ఉండేలా చూడవచ్చని . సర్పంచ్ భవాని, బాలకిషన్, గ్రామపంచాయతీ సెక్రటరీ ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక యువకులు,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.




