📄 ePaper
Monday, March 30, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialపాతగూడూరు యువ నాయకుడు శ్రావణ్ బీఆర్‌ఎస్‌లో చేరిక

పాతగూడూరు యువ నాయకుడు శ్రావణ్ బీఆర్‌ఎస్‌లో చేరిక

📰 Generate e-Paper Clip

పాతగూడూరు యువ నాయకుడు బీఆర్‌ఎస్‌లో చేరిక

 

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న శ్రావణ్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 23 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి చెందిన యువ నాయకుడు కొయ్యడ శ్రావణ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఉప్పు రాజయ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావడం శుభపరిణామమని, ప్రతి కార్యకర్తను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం శ్రావణ్ మాట్లాడుతూ…. తెలంగాణ అభివృద్ధి కేవలం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని నమ్మి తాను పార్టీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular