పాఠశాలల్లో ఒక్కపూట బడి ప్రారంభం..
సిద్దిపేట జిల్లా మర్కుక్, మార్చి 13, ప్రజావాణి
సిద్దిపేట జిల్లా మర్కుక్ పాములపర్తి విద్యానగర్ కాలనీ”ఎం పీ పీ ఎస్ హెచ్ డబ్ల్యు ” పాఠశాల16 మార్చి 2026 సోమవారం నుండి ఒక్కపూట బడి (హాఫ్ డే స్కూల్ ) విధానం అమల్లోకి రానుందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.కొత్త సమయ పట్టిక ప్రకారం పాఠశాల ఫస్ట్ బెల్ ఉదయం 7:45 గంటలకు మోగనుంది. అనంతరం తరగతులు నిర్వహించి మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించిన తరువాత వారిని ఇంటికి పంపించనున్నారు.అందువల్ల విద్యార్థులను ఉదయం 7:40 గంటలలోపు పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం కోరింది. విద్యార్థులు సమయానికి హాజరయ్యేలా తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.



