📄 ePaper
Saturday, July 18, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetన్యాయవాది మొయినుద్దీన్ మృతి పట్ల కోదాడ బార్ అసోసియేషన్ సంతాపం కోదాడలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

న్యాయవాది మొయినుద్దీన్ మృతి పట్ల కోదాడ బార్ అసోసియేషన్ సంతాపం
కోదాడలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

📰 Generate e-Paper Clip

న్యాయవాది మొయినుద్దీన్ మృతి పట్ల కోదాడ బార్ అసోసియేషన్ సంతాపం..
కోదాడలో న్యాయవాదుల విధుల బహిష్కరణ..

కోదాడ, మే 25/ ప్రజావాణి
కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం నిరంతరం పోరాడిన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి పట్ల కోదాడ బార్ అసోసియేషన్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతికి నిరసనగా సోమవారం కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ కోసం మొయినుద్దీన్ చేసిన పోరాటాలు, న్యాయపరమైన సేవలు మరువలేనివన్నారు. ఆయన మరణం న్యాయవాద రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భూకబ్జాలకు వ్యతిరేకంగా నిలబడిన ఒక నిబద్ధత గల వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కోర్టు ప్రాంగణంలో మౌనం పాటించారు. మృతికి కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, సీనియర్ న్యాయవాదులు వై సుధాకర్ రెడ్డి, పాలేటి నాగేశ్వరావు, ఈదుల కృష్ణయ్య, కమిటీ సభ్యులు జాయింట్ సెక్రెటరీ జానీ పాషా, ట్రెజరర్ కెవి రావు, పెద్దబ్బాయి, ఉయ్యాల నరసయ్య, దొడ్డ శ్రీధర్, సామా నవీన్ కుమార్,తాటి మురళి, రియాజ్, దావీదు, కోదండపాణి, నాగుల్ మిర, గోవర్ధన్, రవీందర్, శ్రవణ్ కుమార్, రేణు, చక్రం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular