కడప జిల్లాప్రజావాణిన్యూస్(మార్చి29)పోరుమామిళ్ల మండలం గిరినగర్ కు చెందిన రాళ్లపల్లి ప్రశాంతి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నా పేరు రాళ్లపల్లి ప్రశాంతి(29) భర్త గుర్రం మధుసూదన్ వృత్తి గృహిణి అయిన నేను మనవి చేయడం ఏమనగా మా తల్లిదండ్రులైన రాళ్లపల్లి గురయ్యా రాళ్లపల్లి బాల గుర్రమ్మలకు మేము ఇద్దరం కుమార్తెలము.ఒక కుమారుడు సంతానం అందులో నేను మొదటి కుమార్తెను. నాకు నా భర్త అయిన గుర్రం మధుసూదన్ తో 26/5/2019వ తేదీన పోరుమామిళ్లలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ఇరువురి కుటుంబ సభ్యులు మరియు పెద్దల సమక్షంలో వివాహం అయినది. ప్రస్తుతం నా భర్త బద్వేలు మండలం వీరపల్లె పంచాయతీకి వీఆర్వో గా పని చేయుచున్నాడు.మా వివాహ సమయంలో నా తల్లిదండ్రులు నా భర్తకి కట్నం కింద 15 తులాల బంగారం. ఐదు లక్షల రూపాయలు కట్నం ఇచ్చినారు. నా భర్తకి గతంలో వేరే అమ్మాయితో వివాహం అయ్యి విడాకులు తీసుకున్నారు.ఆ విషయము మాకు చెప్పకుండా మా అత్త మామ దాచిపెట్టి పెళ్లి చేశారు.పెళ్లి అయిన కొద్ది రోజులకి నా భర్త మా మామ గుర్రం కృష్ణయ్య.మా ఆడపడుచు గుర్రం మణిద్వీపరులు నన్ను అదనపు కట్నం తీసుకొని రమ్మని చీటికిమాటికి నన్ను తిడుతూ కొడుతూ వేధిస్తూ ఉన్నారు.నేను అలాగే వారు పెట్టే బాధలను భరిస్తూ ఉన్నాను.ఈ క్రమంలో పెళ్లి అయిన సంవత్సరం కి నా భర్త.మా మామ.మా ఆడపడుచు ముగ్గురు అదరపు కట్నం తీసుకొని రమ్మని నన్ను వేసి చిత్రహింసలు చేసి కొట్టి. బయటికి గెంటేశారు.నేను మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయం చెప్పగా మా తల్లిదండ్రులు నా భర్తకి నచ్చజెప్పి బాగా చూసుకోమని చెప్పి నన్ను నా భర్త దగ్గర వదిలిపెట్టారు.ఈ క్రమంలో నాకు ఒక పాప ఒక బాబు పుట్టారు. నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.అంతేకాక నా భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను నా పిల్లల్ని సరిగ్గా చూసుకోకుండా నన్ను శారీరకంగా.మానసికంగా వేధిస్తున్నాడు.నా భర్తకు సపోర్టుగా మా మామ.మా ఆడపడుచు ఇద్దరు ఉంటూ నన్ను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారు.నా భర్తతో అక్రమ సంబంధం గురించి నేను అడగగా నన్ను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు.మా మామ మా ఆడపడుచు నా భర్తకు సపోర్టుగా వాడు మగవాడు ఎంతమందినైనా ఉంచుకుంటాడు పెళ్లి చేసుకుంటాడు మర్యాదగా నువ్వు సంసారం చేసుకో లేకుంటే నిన్ను కూడా వదిలేస్తాడు అని బెదిరిస్తున్నారు.ఇప్పటికీ ఎనిమిది నెలల నుండి నా భర్త నన్ను నా పిల్లలను బాగోగులు చూసుకోకుండా వదిలేశాడు. ఇప్పుడు నేను నా పిల్లలు బాడుగ ఇంటిలో ఉంటున్నాము.నేను ఇంటి బాడుగ కట్టడానికి నా పిల్లల పోషణకి.వాళ్ల చదువులకి.నేను ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాను.ఈ విషయం పోరుమామిళ్ల తాసిల్దార్ ఉదయ భాస్కర్ రాజు కు విన్నవించుకోగా తగు న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు.ఎంత మంది ప్రభుత్వ అధికారులు చెప్పిన తాను ప్రవర్తన మార్చుకోనని అంటున్నారు.కావున నా మీద నా పిల్లల మీద దయవుంచి తగు న్యాయం చేసి నా కుటుంబానికి అతని కి వచ్చే నెల జీతం లో సగభాగం ఇవ్వాలని పిల్లల బాగోగులు చూడాలని ప్రభుత్వ అధికారులు తగు న్యాయంచేస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను అన్నారు.
నాకు నా పిల్లలకు న్యాయం చేయండి మహాప్రభో.. రాళ్లపల్లి ప్రశాంతి మరియు పిల్లలు ఆవేదన.
0
11
RELATED ARTICLES




