📄 ePaper
Monday, March 30, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalదేవుడు భూమికి డికొండల్ కి సంబంధం....? దేవుడు భూమి మాయం...

దేవుడు భూమికి డికొండల్ కి సంబంధం….? దేవుడు భూమి మాయం వెనుక దండ హస్తం….? నాలుగు ఎకరాలు నోటిమాట..? మూడు ఎకరాల నాలుగు గుంటలు ఎవరి మూట..?

📰 Generate e-Paper Clip

దేవుడు భూమికి డికొండల్ కి సంబంధం….?

 

దేవుడు భూమి మాయం వెనుక దండ హస్తం….?

 

నాలుగు ఎకరాలు నోటిమాట..?

మూడు ఎకరాల నాలుగు గుంటలు ఎవరి మూట..?

 

అప్పటి ఎమ్మార్వో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టేనా..?

 

ఆ ఆర్డీవో చంద్రునికి కనబడలేదా..?

 

కలెక్టర్ గారు రాజరాజేశ్వర స్వామి దేవాలయ భూమి వెతికి పెట్టండి…

 

14 ఎకరాల భూమి అధికారి కుటుంబీకుల పేరుపై మారిందా లేదా…??

వ్యాపారం జరిగినట్టుగా అనుమానం ఉన్న ఖాతా

ప్రజావాణి /హన్మకొండ : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో రాజరాజేశ్వర స్వామి దేవాలయంపై నాలుగెకరాల భూమి ఉందంటూ గత శీర్షికలో ప్రజావాణి పత్రిక ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది . అందులో భాగంగానే వంగర గ్రామ శివారు 576 సర్వే నెంబరులో నాలుగు ఎకరాల భూమి ఉన్నట్టుగా హుజురాబాద్ తాలూకాగా గత రికార్డు ధ్రువీకరణ పత్రాలు గ్రామస్తుల వద్ద ఉండడంతో దేవాలయ భూమిపై ఆరా తీసిన ప్రజావాణి పత్రిక. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కై ల్యాండ్ ఆక్క్వేషన్ అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలలో మూడు ఎకరాల నాలుగు గుంటల భూమి గవర్నమెంట్ సీలింగ్ భూమిగా పొందుపరిచారు. 576 సర్వే నెంబర్లో మూడెకరాల నాలుగు గుంటల భూమికి ప్రభుత్వం ఎటువంటి నగదు ఇతరులకు ఇవ్వకూడదు అని అధికారి మాట్లాడిన వీడియో ప్రజావాణి పత్రికకు అధింది. కానీ 576 సర్వే నెంబరు కి గాను మొత్తం 29 ఎకరాల భూమి ఉండగా 29 ఎకరాలకు ప్రభుత్వం నగదు చెల్లించారు.అయితే రెండో విడత ల్యాండ్ ఆక్క్వేషన్ ధ్రువీకరణ పత్రంలో సీలింగ్ భూమి లేనట్టుగా పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా 576 సర్వే నెంబర్లో 10 ఎకరాల నోషనల్ ఖాతా భూమి కూడా ఉండడం కోసమెరుపు.అసలు ఉన్న భూమిని లేని భూమి గా చూపించడంలో ఆంతర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి.అప్పటి ఆర్డివో గారిని గ్రామస్థులు కలిసిన కనీసం స్పందన లేకపోవడంతో ఇప్పటికైనా కలెక్టర్ గారు వెంటనే స్పందించి దేవుడి భూమిని కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.ఇదిలా ఉంటే అప్పటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ శివారులో వస్తుంది అని ఎవరికి తెలియక ముందే 2022 డిసెంబర్ 27 తేదీన ఎమ్మార్వో అధికారి బంధువులపై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ హద్దులలో గుట్టుచప్పుడు కాకుండా పట్టా భూములు తక్కువ ధరకు తీసుకొని రెండు నెలల కాల వ్యవధిలో 40 లక్షలకు పై మాటతో ఎకరా భూమి చొప్పున డికొండల్ వ్యాపారం చేసినట్టు గ్రామస్తుల ఆరోపణ.డికొండల్ అప్పటి అధికారికి చుట్టమేనా లేక ఆరోపణలు మాత్రమేనా..?.నిజానికి అధికారి బంధువులు అయినటువంటి వారికి డెవలప్మెంట్ అవుతుందని తెలిసి అధికారే చేపించిందా..!అసలు మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఎంత భూమికి నగదు ప్రభుత్వం కట్టించింది..! ఎవరెవరికి ఎంతెంత భూములు ఉన్నాయి..! అధికారి బంధువులపై భూమార్పిడితో అధికార దుర్వినియోగం జరిగిందా..? రాజరాజేశ్వర స్వామి దేవాలయ భూమి ఏమయింది అనే అంశాలపై పూర్తి వివరాలతో మరో సంచికలో మీ ప్రజావాణి పత్రిక.

హుజురాబాద్ తాలూకా ఉన్నప్పటి భూమి

 

మూడు నాలుగు గంటల భూమిని ధ్రువీకరించిన భూమి

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular