📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetదుబ్బాక మండలం ధర్మారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె...

దుబ్బాక మండలం ధర్మారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా తనిఖీ

📰 Generate e-Paper Clip

 

దుబ్బాక మండలం ధర్మారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నం, ఆలుగడ్డ టమాటా, టమాటా చారు లను పరిశీలించారు. రోజు కామన్ డైట్ మెనూ పాటిస్తూ రుచికరంగా ప్రతి వంట విద్యార్థులకు సరిపోయేవిధంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట ప్రక్రియను ఆహారం రుచికరంగా వండి విద్యార్థులకు పెట్టించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. పాఠశాల మొత్తం కలియ తిరుగుతూ 4 వ తరగతికి వెళ్ళి విద్యార్థులతో ఆప్యాయంగా పలకరించారు. విద్యార్థులతో పద్యాలను కథలను చదివించి విద్యార్థిని అభినందించారు. పాఠశాల మీ సబ్జెక్ట్స్ పాటు గ్రంథాలయంలో పలు పుస్తకాలలోని కథలు చదవాలని, కథలలోని సారాంశాన్ని మీ టిచర్ ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. పద్యాలు గట్టిగా బిగ్గరగా పలు మార్లు చదివితే కంఠస్థం అవుతుందని తెలిపారు. మధ్యాహ్నం భోజనం బాగా తినాలని చదువుతో పాటు ఆటలు అందుకోవాలని తెలిపారు.అనంతరం పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పిల్లలకు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పెట్టాలని ఆకుకూరలు, మునగాకు, గుడ్లు పెట్టాలని టిచర్ ను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular