📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే కొలకపూడి ;;;శ్రీనివాసరావు ఆగ్రహం

తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులపై ఎమ్మెల్యే కొలకపూడి ;;;శ్రీనివాసరావు ఆగ్రహం

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లాప్రజావాణిన్యూస్(మార్చి25)తిరువూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వహణ కొనసాగుతోందని,వైన్స్ షాపుల యాజమాన్యం సిండికేట్‌గా ఏర్పడి గ్రామాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని తిరువూరు శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు.బెల్ట్ షాపులు నడుపుతూ ఎమ్మార్పీ కంటే లిక్కర్ బాటిల్ పై 20 నుంచి 30 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నారని,గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపేవారు క్వార్టర్ బాటిల్ పై అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తూ పేద,మధ్యతరగతి కుటుంబాలను దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుని లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఎక్సైజ్ శాఖ అధికారులు లిక్కర్ సిండికేట్‌తో కుమ్మక్కై సీఎం ఆదేశాలను బేకాతర్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.బెల్ట్ షాపుల కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గ్రామీణ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా,ఇప్పటికైనా గ్రామాల్లో విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపులను తొలగించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితర సంబంధిత శాఖల అధికారులకు వినతిపత్రాలు అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular