ప్రజావాణి న్యూస్(మార్చి17) పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డివైఎఫ్ఐ,ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో డ్రగ్స్,గంజాయి పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని డ్రగ్స్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు చిన్ని,వీరణాల.శివకుమార్ ఐద్వాసంఘం జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ బేగం తెలిపారు.జన చైతన్య జీపు జాతా బద్వేలు లో ప్రారంభమై పోరుమామిళ్ళ కు చేరుకుంది.ఈ సందర్భంగా చిన్ని,శివకుమార్,ఐద్వా జిల్లా నాయకురాలు గౌసియా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై విచక్షణ కోల్పోయి ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు అన్నారు. డ్రగ్స్ గంజాయి మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. డ్రగ్స్ గంజాయి మాఫియాను నిర్మూలించాలన్నారు విద్యాసంస్థల వద్ద ట్రాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు ప్రభుత్వం మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్ధాలపై పాఠ్యపుస్తకాలలో ప్రత్యేక పాఠ్యాంశాన్ని చేర్చాలన్నారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక మత్తు విముక్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు ఏరియాలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని తద్వారా క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు ప్రధానంగా యువత చెడు మార్గాల వైపు ఉపాధి లేకనే ఎక్కువ ముగ్గు చూపే అవకాశం ఉందని కావున ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఉపాధి కల్పించాలని వారు కోరారు ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ కే ఆదిల్ విజయ్ పోరుమామిళ్ల డివైఎఫ్ఐమండల అధ్యక్ష కార్యదర్శులు రత్నం సుందరయ్య కెవిపిఎస్ మండల కార్యదర్శి రవికుమార్ సిఐటియు మండల కార్యదర్శి ప్రకాష్ ఐద్వా సంఘం నాయకురాలు బిబి మేరీ ఓబులమ్మ విద్యార్థినీలుతదితరులు పాల్గొన్నారు.షేక్ గౌసియాబేగం ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి
డ్రగ్స్, గంజాయి మాఫియా ను అరికట్టాలి. డివైఎఫ్ఐ
0
21
- Advertisment -



