📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్డ్రంక్ అండ్ డ్రైవ్‌ పై కఠిన చర్యలు – జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు :...

డ్రంక్ అండ్ డ్రైవ్‌ పై కఠిన చర్యలు – జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు : జిల్లా ఎస్పీ శ్రీ యల్.సుబ్బరాయుడు, ఐ.పి.యస్

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా ప్రజావాణిన్యూస్(ఏప్రిల్13) పోలీస్ శాఖ.మద్యం మత్తులో స్కూల్ వాహనం నడిపిన స్కూల్ డ్రైవర్ ను గుర్తించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన గాజులమండ్యం పోలీసులు.స్కూల్ బస్సు డ్రైవర్‌కు 14 రోజుల జైలు శిక్ష తో పాటు రూ.10,000 జరిమానా విధించిన న్యాయస్థానం.తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి వాహనం నడిపిన ఒక యువకుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది.రేణిగుంట రూరల్ పరిధిలోని వడమాలపేట మండలం, టి.సి. అగ్రహారం గ్రామానికి చెందిన మునేంద్ర (25), తండ్రి భాస్కర్ రెడ్డి, మద్యం సేవించి ఎన్.ఆర్.ఐ విద్యాసంస్థల వాహనం నడుపుతూ గాజులమండ్యం పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిపై మోటార్ వాహన చట్టం సెక్షన్ 185(ఎ) కింద కేసు నమోదు చేయడం జరిగింది.ఈ దినం తేదీ 13.04.2026 న నిందితుడిని గౌరవ స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి నందు హాజరుపరచగా, విచారణ సమయంలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.దీనిపై గౌరవ న్యాయమూర్తి గారు BNSS సెక్షన్ 275 కింద నిందితుడికి 14 రోజుల సాధారణ జైలు శిక్ష (13.04.2026 నుండి 26.04.2026 వరకు) విధించారు. అదనంగా, రూ.10,000/- (పది వేల రూపాయలు) జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినారు.పోలీసుల పోలీస్ హెచ్చరిక:మద్యం సేవించి వాహనం నడపడం వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular