సిద్దిపేట్, ఏప్రిల్ 8, ప్రజావాణి
సిద్దిపేట్ధ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో టొరెంట్ గ్యాస్ ఏజెన్సీ మరియు జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు టొరెంట్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ నిల్వలు అధిక మొత్తంలో ఉండడం వల్ల జిల్లాలో టొరెంట్ గ్యాస్ పైప్ లైన్ నుండి ముందుగా ప్రభుత్వ ఆసుపత్రులు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు తర్వాత గృహాలకు విస్తరించడానికి సాధ్య సాధ్యల గురించి కమిటీ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కమిటీలు మున్సిపల్ కమిషనర్లు, అర్అండ్ బి, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, సివిల్ సప్లై, ఫారెస్ట్ ఆఫీసర్, ఇండస్ట్రియల్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ సభ్యులుగా ఉంటారని తెలిపారు.జిల్లా కేంద్రంలో టొరెంట్ గ్యాస్ పైప్ లైన్ 60కి.మీ పైగా విస్తరించినట్లు, జిల్లా కేంద్రంలోని కెసిఆర్ నగర్లో డిఆర్ఎస్ పాయింట్ నుండి పైప్ లైన్ ద్వారా పలు గృహాలకు గ్యాస్ కలెక్షన్ అందిస్తున్నామని టొరెంట్ ప్రతినిధులు వివరించారు. టోరెంట్ గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగవని పూర్తి సెక్యూరిటీగా ఉంటుందని 24/7 ఏజెన్సీ అందుబాటులో ఉంటుందని, గ్యాస్ కొరత లేకుండా మా టొరెంట్ గ్యాస్ కనెక్షన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, లిమిటెడ్ ధరల్లో సేవలు అందిస్తున్నట్లు అలాగే జిల్లాలో 2 సి ఎన్ జీ స్టేషన్లు ద్వారా పలు వాహనాలకు గ్యాస్ అందిస్తున్నట్లు తెలిపారు.టొరంటో గ్యాస్ పైప్ లైన్ లు వెళ్తున్న దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతరత్ర కార్యాలయాల్లో గ్యాస్ కనెక్షన్ తక్షణమే ఇవ్వాలని తెలిపారు.టొరెంట్ గ్యాస్ సేవలు జిల్లా కేంద్రంలో విస్తరించడానికి కమిటీ సభ్యులైన ప్రతి ఒక్క అధికారి సహకరించాలని ఈ సేవలను బస్టాండ్, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో టొరెంట్ గ్యాస్ సేవలకు 8018426836 నంబర్ కి సంప్రదించాలని తెలిపారు.ఈ సమావేశంలో డిఎఫ్ ఓ పద్మజారాణి, డి సి ఎస్ ఓ తనుజ, పోలీస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సుభాష్ చంద్రబోస్, డిపిఓ రవీందర్, టొరెంట్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు..


