జెడ్ హెచ్ డి సి భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి భూమిలేని నిరుపేదలకు నాగసాని పల్లెలో ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలి గ్రామాలలో వలసలు నివారించాలంటే భూమి ఉపాధి పనులు కల్పించాలి
ఖాజీపేట మండల పరిధిలో గ్రామీణ వలసలు నివారణకు భూమిలేని పేదలందరికీ రెండు ఎకరాలు చొప్పున భూ పంపిణీ అమలు చేయాలని అదేవిధంగా జెడ్ హెచ్ డి సి భూములకు పట్టాలు ఆన్లైన్లో అమలు చేసి రైతు భరోసా కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని వ్యవసాయ కార్మిక సంఘం మండల గౌరవ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి కార్యదర్శి వీరబ్రహ్మం వీర ప్రతాప్ మహేంద్ర యాదవ్ కోరారు సోమవారం సోమవారం ఉదయం స్థానిక తాసిల్దారు వెంకట రమణమ్మ కు వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ అమలు చేయాలని ఉపాధి హామీ చట్టం పాత పద్ధతిలోనే అమలు చేయాలని గ్రామాలలో కూలీలకు పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు రాజశేఖర్ రెడ్డి వీరబ్రహ్మం వీర ప్రతాప్ మహేంద్ర యాదవ్ మాట్లాడుతూ నాగసాని పల్లె రెవెన్యూ పొలంలో 2000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూములను స్థానిక నాగసానిపల్లె చుట్టుపక్కల గ్రామాల భూమిలేని నిరుపేదలకు మూడు ఎకరాల చొప్పున కూటమి ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగం భూ పంపిణీ అమలు చేయాలని కోరారు అదేవిధంగా నాగసాని పల్లెలో 100 ఎకరాలు ఎస్టేట్లో నిర్మించుకున్నారు అడ్డదారిలో తప్పుడు పద్ధతిలో విద్యుత్ కనెక్షన్లు ట్రాన్స్ఫారాలుబిగించుకున్నారువాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఇతర రెవెన్యూ గ్రామాలలో కూడా ప్రభుత్వ భూములు అన్యక్రాంతమైనాయి ఆ భూములను కూడా స్వాధీనం చేసుకొని గ్రామాలలో నిరుపేదల ఎస్సీ ఎస్టీ బీసీలకు భూ పంపిణీ అమలు చేయాలని కోరారు జెడ్ హెచ్ డి సి భూములు 50 సంవత్సరాల క్రిందట చెములూరు గాంధీనగర్ బాలానగర్ తదితర గ్రామాలలో 200 కుటుంబాలకు పైనే ఎకరం చొప్పున భూమి పంపిణీ చేశారు కానీ పట్టాలు ఆన్లైన్లో రైతు భరోసా సౌకర్యాలు సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం
లేదని అన్నారు అన్ని విధాలా జెడ్ హెచ్ డి సి సాగులో నిరుపేద రైతులు ఆన్లైన్లో బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు నష్టపరిహారం రుణమాఫీలు తీవ్రంగా నష్టపోతున్నారు వారిని వెంటనే అన్ని నేనువిధాలుగా ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ను డిమాండ్ చేస్తున్నామన్నారు
జెడ్ .హెచ్ డి .సి భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
RELATED ARTICLES




