📄 ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామసహాయం హరిత రెడ్డి.

జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామసహాయం హరిత రెడ్డి.

📰 Generate e-Paper Clip

హరిత రెడ్డికి కీలక బాధ్యతలు

పార్టీ సేవలకు గుర్తింపు.

కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం.

తిరుమలాయపాలెం నేతకు జిల్లా స్థాయి పదవి.

తిరుమలాయపాలెం,ప్రజావాణి:

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తిరుమలాయపాలెం మండలానికి చెందిన రామసహాయం హరిత రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం అధికారిక ఆదేశాలు జారీ చేశారు.మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కీర్తిశేషులు భవన సుందర్ రెడ్డి కుమారుడు, ప్రముఖ న్యాయవాది రామసహాయం అరవింద రెడ్డి సతీమణిగా, అలాగే బచ్చోడు గ్రామ మాజీ సర్పంచ్‌గా పనిచేసిన హరిత రెడ్డి పార్టీ పట్ల దీర్ఘకాలంగా అంకితభావంతో సేవలందిస్తున్నారు. ఆమె కుటుంబం కూడా ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తోంది.ఈ క్రమంలో ఆమెకు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి దక్కడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular