📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialజిల్లాలో ఫిష్ మార్కెట్, ఫిషరీ యూనిట్లు ఏర్పాటు చేయాలి

జిల్లాలో ఫిష్ మార్కెట్, ఫిషరీ యూనిట్లు ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

*జిల్లాలో ఫిష్ మార్కెట్, ఫిషరీ యూనిట్లు ఏర్పాటు చేయాలి*
*తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా యువజన అధ్యక్షుడు గరిగే సుమన్ ముదిరాజ్*
*రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం*
జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజు ల జీవనోపాధి కొరకు జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంతో పాటు మందమర్రిలో ఫిష్ మార్కెట్ తోపాటు ఫిషరీ యూనిట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా యువజన అధ్యక్షుడు గరిగే సుమన్ కోరారు. గురువారం హైదరాబాద్ లో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖలు, క్రీడలు, యువజన సేవలు శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి, పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, జిల్లాలో నివసిస్తున్న ముదిరాజ్ లు తమ జీవనోపాధి కొరకు కులవృత్తి అయిన చేపల పట్టి, వాటిని అమ్మి, వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని, జిల్లాలో చాలా కుటుంబాలు చేపల వృత్తి మీదనే జీవిస్తున్నాయని తెలిపారు.  జిల్లాలో సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో దీనిపైన జీవిస్తున్న ముదిరాజ్ కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ముదిరాజ్ ల ఆర్థిక స్వలంబన, అభివృద్ధి కొరకు మంచిర్యాల, మందమర్రి ప్రాంతాలలో ఫిష్ మార్కెట్లు ఏర్పాటు చేయడంతో పాటు దానికి కావలసిన స్థలం, నిధులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా ఫిషర్ యూనిట్లను సైతం మంజూరు చేయాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular