కడప జిల్లా *జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం, కందిమల్లయ్య మహా సంస్థానం.8వ తరం, 12 వ మఠాధిపతులు శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారి పట్టాభి శాఖ మహోత్సవంలో పాల్గొన్న రెడ్యo.శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారిని ఘనంగా సన్మానించిన రెడ్యo.జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం, కందిమల్లయ్య పుర మహా ప్రస్థానం… బ్రహ్మంగారిమఠంలో 8వ తరం, 12 వ మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారి పట్టాభిషేక మహోత్సవం గురువారం తృతీయహ్నికము లో కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారికి కిరీటి ధారణ చేసి గణంగా పట్టాభిషేకం నిర్వహించారు వారి ప్రతినిధి నొస్సం దత్తాత్రేయ స్వామివారి ఆహ్వానం మేరకు…*

*మఠాధిపతుల వారి పట్టాభిషేక మహోత్సవంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యo వెంకటసుబ్బారెడ్డి పాల్గొని మఠాధిపతి ల వారు శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారిని పట్టు శాలువ తో భారీ పూల మాలతో ఘనంగా సన్మానించారు.పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా రెడ్యo అభివర్ణించారు. వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొని శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కృప పాత్రుడయునట్లు రెడ్యo తెలిపారు. రెడ్యo ను మఠాధిపతులు ఆశీర్వదించారు. మఠాధిపతల సోదరుడు నొస్సం దత్తాత్రేయ స్వామివారు దగ్గరుండి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దర్శనం చేయించారు.సాంప్రదాయంగా రెడ్యo ను శేష వస్త్రం తో పూజారులు సత్కరించారు. అనంతరం దత్తాత్రేయ స్వామివారు రెడ్యo ను సన్మానించారు.*




