📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఘనంగా అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు.

ఘనంగా అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు.

📰 Generate e-Paper Clip

..

సమానత్వం,న్యాయం కోసం అంబేద్కర్ చేసిన సేవలు స్మరణీయం..

కాశినాయన:

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 135వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాశినాయన మండల కేంద్రమైన నరసాపురంలో తాసిల్దార్ కార్యాలయ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ మెంబర్, యంబడి పోలయ్య హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా యంబడి పోలయ్య మాట్లాడుతూ సమాజంలోని అంటరానితన్నాన్ని నిర్మూలించేందుకు అంబేడ్కర్‌ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు.అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానేత అని కొనియాడారు. సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ స్మరణీయమని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వరికుంట్ల బాబు, మండల ప్రధాన కార్యదర్శి కిరణ్,మండల కమిటీ సభ్యులు ఓబయ్య, జయరాములు, రామాంజనేయులు,జీవన్,రాజు,మనీష్, శ్రీనాథ్,మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular