📄 ePaper
Tuesday, April 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గ్రామ సచివాలయంలో పెట్రేగుతున్న ప్రైవేటు వ్యక్తుల ఆగడాలు.

గ్రామ సచివాలయంలో పెట్రేగుతున్న ప్రైవేటు వ్యక్తుల ఆగడాలు.

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21)  నాయుడుపేట మండలం మేనకూరు గ్రామ సచివాలయంలో పెట్రేగుతున్న ప్రైవేటు వ్యక్తుల ఆగడాలు.గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ సచివాలయాన్ని శాసిస్తూ లక్షల రూపాయలు స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్న ప్రజలు. త్రాగునీటి యంత్రానికి వచ్చే డబ్బులు నుంచి అనధికారికంగా వసూలు చేస్తున్న ఇంటి పన్నుల వరకు నెలలో లక్షల రూపాయలు ప్రైవేటు వ్యక్తులు స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్న ప్రజలు. పన్నులు వసూళ్ల సంగతి దేవుడు కెరుక సచివాలయం తాళాలు తన కబంధహస్తాల్లో ఉంచుకుని ఇటు సిబ్బంది అటు అధికారులు తాళాలు తీయమని చెబితే వారిపై జులం ప్రదర్శిస్తున్న వైనం. మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అండదండల పుష్కలంగా ఉన్నాయని ఇటు సిబ్బందిపై అటు ప్రజలపై ప్రైవేటు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న ప్రజలు. గ్రామ సచివాలయంలోని కంప్యూటర్లను ప్రైవేటు వ్యక్తులు వాడుతూ ప్రజల యొక్క రికార్డులను తారుమారు చేస్తున్నారని ఆవేదన చెందుతున్న ప్రజానీకం.మేనకూరు గ్రామ సచివాలయంలో ప్రైవేటు వ్యక్తుల ఆగడాలను కట్టడి చేసి ప్రజల రికార్డులను మరియు ప్రజాధనాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకుంటున్న ప్రజలు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular