📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
HomeతెలంగాణNizamabadగ్రామాభివృద్ధి ప్రణాళికపై కోటగిరిలో ప్రత్యేక గ్రామ సభ.

గ్రామాభివృద్ధి ప్రణాళికపై కోటగిరిలో ప్రత్యేక గ్రామ సభ.

📰 Generate e-Paper Clip

గ్రామాభివృద్ధి ప్రణాళికపై కోటగిరిలో ప్రత్యేక గ్రామ సభ.

2026-27 యాక్షన్ ప్లాన్ రూపకల్పన.

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ పై ప్రత్యేక గ్రామ సభను సర్పంచ్ బర్ల మధుకర్ అధ్యక్ష తన బుధవారం నిర్వహించారు.ఈ సభలో గ్రామస్థులు తమ సమస్యలను ప్రస్తావించగా పంచాయతీ కార్యదర్శి ఆర్.సందీప్ అన్ని సమస్యలను నోట్ చేసుకున్నారు.2026 – 27 ఆర్థిక సంవత్సరానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరంగా చర్చించి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బర్ల మధుకర్ మాట్లాడుతూ. భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని గ్రామస్థులకు సూచించారు.ఈ గ్రామ సభలో ఉపసర్పంచ్,వార్డ్ మెంబర్లు,ఆశా వర్కర్లు, ఏఎన్ఎం,గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular