గోదావరిఖని బస్టాండ్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని: గోదావరిఖని బస్టాండ్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తెలిపారు. శనివారం బస్టాండ్‌లో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
బస్టాండ్‌లో ఆధునిక ప్లాట్‌ఫారమ్‌లు, ప్రత్యేక ఆటో స్టాండ్, ఆటో డ్రైవర్లకు అవసరమైన సౌకర్యాలు, తాగునీటి వసతి, పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు, ఫుట్‌పాత్‌లు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా బస్టాండ్‌ను అన్ని విధాలా సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సింగరేణి జనరల్ మేనేజర్, సంబంధిత శాఖల అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

