📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliగోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంద్ర మహిళా శక్తి క్యాంటిన్ ను గౌరవ ఎమ్మెల్యే ఎం. రాజ్...

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంద్ర మహిళా శక్తి క్యాంటిన్ ను గౌరవ ఎమ్మెల్యే ఎం. రాజ్ ఠాకూర్ గారు ప్రారంభించారు

📰 Generate e-Paper Clip

రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోగులు, వారి బంధువులకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఇంద్ర మహిళా శక్తి క్యాంటిన్ ను గౌరవ ఎమ్మెల్యే ఎం. రాజ్ ఠాకూర్ గారు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. ………

, ఆసుపత్రికి వచ్చే పేద మరియు మధ్యతరగతి ప్రజలకు పరిశుభ్రమైన, తక్కువ ధరలో భోజనం అందించేందుకు ఈ క్యాంటిన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళా సంఘాల ద్వారా నిర్వహించబడే ఈ క్యాంటిన్ మహిళల ఆర్థిక స్వావలంబనకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular