ప్రజావాణి న్యూస్(మార్చి31)గిద్దలూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో శేషశయనారెడ్డి ఘన విజయం అధ్యక్షుడిగా’హ్యాట్రిక్’ రికార్డు ఉపాధ్యక్షునిగా ఆవులమంద తిరుమల ప్రసాద్,ప్రధాన కార్యదర్శిగా బి.ఐజాక్,కోశాధికారిగా షేక్ ఫాజి-ఉప కార్యదర్శి,చల్లగాలి పోలయ్య,స్పోర్ట్స్ & కల్చరల్ కార్యదర్శిగా పాలుగుళ్ళ విజయ్ కుమార్ రెడ్డి, లైబ్రేరియన్ గా ఎమ్మె రైడర్ బాబు,గిద్దలూరు న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పి.ఎన్. శేషశయనా రెడ్డి ఘన విజయం సాధించారు. ఉదయం నుంచి జరిగిన పోలింగ్ ప్రక్రియ అనంతరం సాయంత్రం ఫలితాలను వెల్లడించారు.ఈ ఎన్నికల్లో ప్రధాన పదవులన్నిటికీ ద్విముఖ పోటీ నెలకొనగా,విజేతలు తమ ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.పి.ఎన్.శేషశయనా రెడ్డి తన సమీప ప్రత్యర్థి పరదేశి నిరంజన్ పై 33 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.బి.ఐజాక్ తన ప్రత్యర్థి ఉదయగిరి మల్లిఖార్జున పై 29 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.షేక్ ఫాజిల్ తన ప్రత్యర్థి కె.సత్య సులోచన పై 27 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.గెలుపొందిన ముగ్గురు అభ్యర్థులు (అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి, కోశాధికారి) తమ ప్రత్యర్థులపై ఖచ్చితమైన ఓట్ల మెజార్టీతోనే విజయం సాధించడంతో విశేషం సంతరించుకుంది.ఇది బార్ అసోసియేషన్ సభ్యులలో చర్చనీయాంశంగా మారింది.ఉపాధ్యక్షునిగా ఏ.తరుమల ప్రసాద్,ఉప కార్యదర్శిగా చల్లగాలి పోలయ్య ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.దీంతో నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగిసింది. విజయం అనంతరం నూతన అధ్యక్షులు శేషశయనారెడ్డి మాట్లాడుతూ.తనపై నమ్మకంతో మూడవసారి అధ్యక్ష పీఠాన్ని అప్పగించిన సహచర న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.న్యాయవాదుల సంక్షేమం కోసం,బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం మా కార్యవర్గం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, కోర్టు ఆవరణలో మౌలిక సదుపాయాల కల్పన మరియు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ విజయం పట్ల స్థానిక న్యాయవాదులు,కోర్టు సిబ్బంది మరియు పలువురు ప్రముఖులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.ఎన్నికల ప్రక్రియ ముగియడంతో బార్ అసోసియేషన్‌లో సందడి వాతావరణం నెలకొంది.
Homeఆంధ్రప్రదేశ్గిద్దలూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో శేషశయనారెడ్డి ఘన విజయం - అధ్యక్షుడిగా 'హ్యాట్రిక్' రికార్డు
గిద్దలూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో శేషశయనారెడ్డి ఘన విజయం – అధ్యక్షుడిగా ‘హ్యాట్రిక్’ రికార్డు
0
8
- Advertisment -


