📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గరికపాటి సమాజానికి పట్టిన చీడపురుగు - BSP MPTC బర్రె ఉదయ్ కిరణ్

గరికపాటి సమాజానికి పట్టిన చీడపురుగు – BSP MPTC బర్రె ఉదయ్ కిరణ్

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి22)కంచికచర్ల పండితుడు ముసుగు వేసుకొని పేద విద్యార్థుల మీద బుసలు కొడుతున్న విషపు నాగుపాము గరికపాటి. జాతీయ బాలల హక్కుల కమిషన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్  సుమోటోగా తీసుకొని గరికపాటిమీద కేసు నమోదు చేయాలి.ప్రభుత్వము తక్షణమే పద్మశ్రీ,కళా రత్న అవార్డులను ఉపసంహరించుకోవాలి.పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లి గరికపాటి లాంటి చీడపురుగులను సమాజం నుండి ఏరివేయాలి.ప్రభుత్వ పాఠశాలల మరుగుదొడ్లను శుభ్రం చేసి తను చేసిన బాధ్యత రాహిత్య వ్యాఖ్యలకు పాప ప్రక్షాళన చేసుకోవాలి.ప్రముఖ ప్రసంగకర్త,ఆధ్యాత్మిక అవధాని గరికపాటి నరసింహారావు ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల మీద చేసిన బాధ్యత రాహిత్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, బర్రె ఉదయ్ కిరణ్, పత్రికా ప్రకటన విడుదల చేశారు, మరియు స్థానిక పోలీస్ స్టేషన్లో గరికపాటిమీద చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.బర్రె ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ పండితుడనే ముసుగులో గరికపాటి లాంటివారు పేద విద్యార్థుల కోసం ప్రభుత్వాలు అవలంబిస్తున్న,చేపడుతున్న పథకాలను,వసతులను తట్టుకోలేక తన అక్కస్సును వెల్లగక్కటం అనేది చాలా సిగ్గుచేటని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులు కేవలం కోడిగుడ్ల కోసం మాత్రమే వస్తున్నారని వారికి మధ్యాహ్న భోజన పథకం,ఉచిత పుస్తకాలు యూనిఫామ్ ఇచ్చి ప్రభుత్వాలు పాడు చేస్తున్నారని అనడం మరియు విద్యార్థులను ఉద్దేశించి శోభనానికి ముస్తాబైన పెళ్ళికొడుకులని వ్యాఖ్యానించడం నిజంగా చాలా సిగ్గుచేటు అని సమాజ శ్రేయస్సును మరియు పేద విద్యార్థుల భవిష్యత్తును కాంక్షించే ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఈ వాక్యాలను ఖండించాలని ఉదయ్ కిరణ్ తెలిపారు.ఆయన చేసిన ఈ వాక్యాలు పేద విద్యార్థుల మానసిక ధైర్యం మీద,మానసిక ఎదుగుదల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఉదయ్ కిరణ్ తెలిపారు. గరికపాటి అతను పండితుడని ముసుగు వేసుకొని దేహం మొత్తం విషం నింపుకున్న నాగుపామని,ఇటువంటి గరికపాటిలు సమాజంలో చాలామంది ఉన్నారని ఉదయ్ అన్నారు.జాతీయ బాలల హక్కుల కమిషన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ గరికపాటి చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేయాలని తెలిపారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి పద్మశ్రీ కళా రత్న అవార్డులను ఉపసంహరించుకోవాలని కోరారు. అవార్డులు ఇచ్చేముందు ప్రభుత్వం వారు వ్యక్తులు యొక్క స్వభావాన్ని,నడవడికను తెలుసుకోవాలని కోరారు.పేద విద్యార్థులను ఉద్దేశ పూర్వకంగా అవమానించి వారి హక్కుల కు భంగం కలిగించిన గరికపాటిమీద సెక్షన్ 153a,504,505(2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉదయ తెలిపారు.అనంతరం స్థానిక అంబేద్కర్ సెంటర్లో గరికపాటి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనను వ్యక్తపరిచారు.గరికపాటి తక్షణమే స్పందించి పేద విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని,భవిష్యత్తులో ఇలాంటి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులు ఉపయోగించిన మరుగుదొడ్లను శుభ్రపరచి గరికపాటి చేసిన బాధ్యత రాహిత్య వ్యాఖ్యలకు నిరసనగా పాపప్రక్షాళన చేసుకోవాలని ఉదయ్ కిరణ్ హితవు పలికారు.కాబట్టి ప్రజలు ఇకనైనా తెలుసుకొని ఇలాంటి నాగుపాము లాంటి గరికపాటి లాంటి వారి నుండి సమాజాన్ని రక్షించాలని ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగ విలువలను కాపాడాలని ఉదయ్ కిరణ్ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు బడుగు కోటి గారపాటి సూర్యవంశీ జంగా తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular