ప్రజావాణి :విజయవాడ రెచ్చిపోతున్న అక్రమ కట్టడాలుటౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతోనే ‘ప్లానింగ్ నాగేశ్వరరావు’ దందా విజయవాడ, కృష్ణలంక:నగరంలోని కృష్ణలంక ప్రాంతం అక్రమ కట్టడాలకు అడ్డాగా మారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా భారీ భవనాలు వెలుస్తున్నా పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం వెనుక ‘ప్లానింగ్ నాగేశ్వరరావు’ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.ముడుపుల మత్తులో యంత్రాంగం?విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ అక్రమ నిర్మాణాలకు క్లియరెన్స్ ఇప్పించే క్రమంలో నాగేశ్వరరావు భారీ మొత్తంలో ముడుపులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలోని కీలక అధికారులకు ఈ అక్రమ సొమ్ములో పెద్ద వాటా అందినట్లు సమాచారం. అందుకే, నిబంధనలను బేఖాతరు చేస్తూ చేపడుతున్న ఈ భారీ కట్టడాల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
కృష్ణలంకలో రెచ్చిపోతున్న అక్రమ కట్టడాలు టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతోనే ‘
0
13
- Advertisment -




