📄 ePaper
Friday, April 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాకరవాయి  గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామసభ నిర్వహణ.

కాకరవాయి  గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామసభ నిర్వహణ.

📰 Generate e-Paper Clip

గ్రామ అభివృద్ధికి ప్రజల సూచనలు కీలకం

సంక్షేమ పథకాలపై గ్రామసభలో చర్చ

సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ

తిరుమలాయపాలెం,ప్రజావాణి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామసభను సర్పంచ్ గూడూరు ఉపేందర్, పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేశారు.గ్రామసభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ అభివృద్ధి పనులు, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను ప్రస్తావించగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలు గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.గ్రామసభ పంచాయతీ రాజ్ వ్యవస్థలో కీలక భాగమై, ప్రజల అభిప్రాయాలతో నిర్ణయాలు తీసుకునే వేదికగా పనిచేస్తుందని అధికారులు తెలిపారు.  కార్యక్రమంలో  ఆర్ ఐ  పవన్, కాకరవాయి పల్లె దావకాన ఆఫీసర్ ఆఫీసర్  డాక్టర్ నిరీష , ఆత్మ కమిటీ డైరెక్టర్ ఉప్పునూతల నాగేశ్వరరావు, ఉప సర్పంచ్  కొత్తపల్లి వినోద, వార్డు సభ్యులు అన్నం రజిత, గ్రామ పెద్దలు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular