📄 ePaper
Wednesday, April 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఒంటిమిట్ట లో ఏప్రిల్ 01 న రాముల వారి కల్యాణోత్సవం నిర్వహణ పై జిల్లా కలెక్టర్...

ఒంటిమిట్ట లో ఏప్రిల్ 01 న రాముల వారి కల్యాణోత్సవం నిర్వహణ పై జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ముమ్మర తనిఖీ…

📰 Generate e-Paper Clip

కడపజిల్లా,ప్రజావాణి న్యూస్(మార్చి31)ఒంటిమిట్ట ఏప్రిల్ హెలిప్యాడ్,టిటిడి అతిథి గృహం,ఆలయం వద్ద ఏర్పాట్ల పరిశీలన 1న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,టిటిడి జె ఈ ఓ వి.వీర బ్రహ్మం.ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలక ఘట్టమైన ‘శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి’జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది.మొదట హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అనంతరం టిటిడి అతిధిగృహంలో ముఖ్యమంత్రి గారు బస చేసే వసతి గృహాన్ని పరిశీలించారు.అనంతరం ఆలయం వద్ద స్వామివారి దర్శనానికి విచ్చేసే ముఖ్యమంత్రి గారి పర్యటన కు సంబంధించి రూట్ మ్యాప్ ఆధారంగా టీటీడీ సివిఎస్ఓ మురళీ కృష్ణ,ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, సీఎం సెక్యూరిటీ తో కలసి పరిశీలించారు.హెలిప్యాడ్ వద్ద పటిష్టంగా బారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని,టిటిడి అతిధి గృహం వద్ద కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు పై జిల్లా కలెక్టర్ సీఎం సెక్యూరిటీతో చర్చించారు.ఆలయం వద్ద స్వామివారి దర్శనానికి విచ్చేసే ముఖ్యమంత్రి గారికి చేయవలసిన ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని ఆదేశించారుజిల్లా కలెక్టర్.ఈ కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన,ఏఎస్పి మనోజ్ రామ్నాథ్ హెడ్లే,మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular