📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏపీ చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్ నేడు బాధ్యతల స్వీకరణ

ఏపీ చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్ నేడు బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

అమరావతి ప్రజావాణిన్యూస్(మార్చి25)రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ కె.విజయానంద్ ఉద్యోగ విరమణ అనంతరం నూతన సీఎస్ సాయిప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం గతేడాది నవంబరు 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన సాయిప్రసాద్.శని వారం ఉదయం 11.33 గంటలకు నూతన సీఎస్ గా సచివాలయంలో బాధ్యతలు చేపడతారు.1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కీలక పదవులు నిర్వహించారు.2024 జూన్ నుంచి జల వనరులశాఖ కార్యదర్శిగా 2025 జనవరి నుంచి ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా వ్యవహరిస్తున్నారు.రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా ప్రభుత్వం ఆయనకే అప్పగించింది.2019-24 మధ్య కాలంలో ఆయన ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ, ఇంధనశాఖ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి,సీసీఎల్ఎగా వ్యవహరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular